For Money

Business News

ఏటీఎంలను మూసేసిన బ్యాంక్‌

దేశంలో మొదటిసారి ఒక బ్యాంక్‌ తన ఏటీఎంలను మూసేయాలని నిర్ణయించింది. సూర్యోదయ్‌ స్మాల్‌ ఫైనాన్స్ బ్యాంక్‌ తన ఏటీఎంలను మూసేయనుంది. ఈ బ్యాంక్‌కు 26 ఏటీఎంలు ఉన్నాయి. ఏటీఎంల నిర్వహణ కన్నా తన ఖాతాదారులకు ఇతర బ్యాంకుల ఏటీఎంలు వాడుకునే సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. నెలకు 5 నుంచి 7 సార్లు ఇతర బ్యాంకు ఏటీఎంల నుంచి ఉచితంగా విత్‌ డ్రా చేసే సౌకర్యం కల్పించే అంశాన్ని పరిశీలిస్తోంది. ఏటీఎంల నిర్వహణ భారం అధికం కావడంతో బ్యాంక్‌ ఈ నిర్ణయం తీసుకుంది. మున్ముందు చిన్న బ్యాంకులు ఇదే బాటలో పయనించవచ్చని.. పెద్ద బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుని.. తమ ఏటీఎంలను మూసేయొచ్చని బ్యాంకింగ్‌ నిపుణులు అంటున్నారు.