జీ టీవీ, సోనీ డీల్‌కు ఇన్వెస్కో బ్రేక్?
జీ ఎంటర్టైన్మెంట్, సోనీ పిక్చర్ మధ్య డీల్‌కు ఓ ప్రధాన అవరోధం ఎదురు కానుంది. జీ టీవీ ప్రమోటర్లను డైరెక్టర్లుగా తొలగించేందుకు అసాధారణ జనరల్ సమావేశం (ఈజీఎం) కోసం ఇన్వెస్కో ఫండ్ ఇది వరకే నోటీసు ఇచ్చింది. ఈజీఎంలో తీర్మానాలను ఆమోదించిన తరవాతే ఏదైనా చర్యలు తీసుకోవాలని ఇన్వెస్కో అంటోంది. ఇపుడు జీ టీవీ వాటాదారుల్లో ఇన్వెస్కో అతి పెద్ద ఇన్వెస్టర్. ఇన్వెస్కో ఇచ్చిన నోటీసు మేరకు జీ టీవీ మూడు వారాల్లోగా ఈజీఎం నిర్వహించాలి. లేని పోంలో ఇన్వెస్కోనే నిబంధనల మేరకు ఆరు నెల్లో ఈజీఎం నిర్వహించే అవకాశముంది. తాను ఇచ్చిన నోటీసు పెండింగ్‌లో ఉండగా.. సోనీ పిక్చర్తో విలీన డీల్ కుదుర్చుకోవడాన్ని ఇన్వెస్కో వ్యతిరేకిస్తోంది. ముందు తన నోటీసుపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. జీ టీవీ బోర్డు తగిన నిర్ణయం తీసుకోని పక్షంలో తాము కోర్టును ఆశ్రయిస్తామని ఇన్వెస్కో అంటోంది.