NIFTY TRADE: నో ట్రేడింగ్ ఛాన్స్
నిఫ్టి ఇవాళ భారీ లాభాలతో ప్రారంభం కానుంది. నిఫ్టి క్రితం ముగింపు 17,546. సింగపూర్ నిఫ్టి వంద పాయింట్ల లాభంతో ఉంది. అదే స్థాయిలో నిఫ్టి ప్రారంభమైతే…అంటే 17640పైన ప్రారంభమైతే… డే ట్రేడర్స్ చేయడానికి ఏమీ లేదు. సెప్టెంబర్ నెల మొత్తంగా చూస్తే నిఫ్టి కదలికలో పెద్ద మార్పు లేదు. ఇవాళ వీక్లీ డెరివేటివ్స్ క్లోజ్. పైగా ఇక వారం రోజులే ఉంది ఈ నెల డెరివేటివ్స్‌కు. బ్యాంక్ నిఫ్టి ప్రస్తుతం నిఫ్టికి ఎలాంటి మద్దతు ఇవ్వడం లేదు. ఇలాంటి పరిస్థితిలో నిఫ్టిలో 17,600పైన ట్రేడ్ చేయడం అనవసరం. టెక్నికల్‌గా సూచీలు సెల్ సిగ్నల్ ఇస్తున్నాయి. నిఫ్టి ఒకవేళ 17590 ప్రాంతానికి పడితే మాత్రం నిఫ్టి మరింత క్షీణించే అవకాశముంది. నిఫ్టి ఈ స్థాయికిపైన ఉన్నంత వరకు పరవాలేదు. ఒకవేళ తగ్గితే 17560 దాకా వస్తుందేమో చూడండి. నిఫ్టికి కొనుగోలు మద్దతు స్థాయి మాత్రం 17500 ప్రాంతంలో ఉంది. సో… ఇవాళ నిఫ్టి ఈ స్థాయికి వస్తుందా అన్నది అనుమానమే. రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్లు అధికస్థాయిలో అమ్మి.. స్వల్ప లాభాలతో బయటపడొచ్చు. ఆల్గో ట్రేడింగ్ లెక్కల ప్రకారం నిఫ్టి 17560కి వచ్చే అవకాశముంది. రిస్క్ వొద్దనుకునేవారు. మార్కెట్‌కు దూరంగా ఉండమని విశ్లేషకులు సలహా ఇస్తున్నారు.