21 శాతం ప్రీమియంతో లిస్టయిన ఫ్రెష్‌వర్క్స్
చెన్నైకు చెందిన ఫ్రెష్‌వర్క్స్ ఇన్‌కార్పొరేట్ కంపెనీ షేర్ ఇవాళ నాస్‌డాక్‌లో లిస్టయింది. ఓపెనింగ్‌లోనే ఈ షేర్ 43.5 డాలర్ల వద్ద లిస్టయింది. ఒక్కో షేర్‌ను కంపెనీ 36 డాలర్లకు ఆఫర్ చేసింది. ఈ ధర వద్ద ఫ్రెష్‌వర్క్స్ కంపెనీ మార్కెట్ వ్యాల్యుయేషన్ రూ. 90,000 కోట్లను దాటింది. ఫ్రెష్‌వర్క్స్ వంటి కంపెనీ షేర్లకు అమెరికాలో మంచి డిమాండ్ ఉంటుందని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. ఈ పబ్లిక్ ఆఫర్‌కు మోర్గాన్ స్టాన్లీ, జేపీ మోర్గాన్, బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ లీడ్ అండర్ రైటర్స్‌గా వ్యవహరించాయి.