For Money

Business News

నాస్‌డాక్‌లో లిస్టయిన చెన్నై కంపెనీ

చెన్నై నగర శివార్లలో ఓ చిన్న వేర్‌హౌజ్‌లో 11 ఏళ్ళ క్రితం ఏర్పడిన ఫ్రెష్‌వర్క్స్‌ కంపెనీ ఇవాళ నాస్‌డాక్‌లో లిస్టయింది. 2010లో ఏర్పడిన ఈ కంపెనీ 113 కోట్ల డాలర్లను సమీకరించేందుకు క్యాపిటల్‌ మార్కెట్‌లోకి వచ్చింది. ఇవాళ నాస్‌డాక్‌ లిస్ట్‌ అయింది. ట్రేడింగ్‌ ధర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సాఫ్ట్‌వేర్‌ యాజ్‌ ఏ సర్వీస్‌ (SaaS) రంగానికి చెందిన ఈ కంపెనీ షేర్లకు రోడ్‌షోలో భారీ డిమాండ్ వచ్చింది. తొలుత ఒక్కో షేర్‌ను 28 నుంచి 32 డాలర్లకు ఆఫర్‌ చేసిన ఈ కంపెనీ… డిమాండ్‌ బాగుండటంతో 32 నుంచి 34 డాలర్లకు పెంచింది. అయినా డిమాండ్‌ ఇంకా అధికంగా ఉండటంతో ఒక్కో షేర్‌ ధర 36 డాలర్లకు ఆఫర్‌ చేసింది. ఈ లెక్కన ఈ కంపెనీ మార్కెట్‌ వ్యాల్యూ 1000 కోట్ల డాలర్లను దాటింది. లిస్టింగ్‌ ధర అధికంగా ఉండొచ్చని భావిస్తున్నారు. అంటే లిస్టింగ్‌ రోజునే ఈ కంపెనీ మార్కెట్‌ వ్యాల్యూయేషన్‌ రూ. 75,000 కోట్లను దాటనుంది. త్వరలోనే లక్ష కోట్ల రూపాయల క్లబ్‌లో ఈ కంపెనీ చేరుతుందని భావిస్తున్నారు. కరోనాకు ముందు అంటే 2019లో కూడా ఈ కంపెనీ వ్యాల్యూయేషన్‌ 350 కోట్ల డాలర్లు ఉండేది. మనదేశంలో సాఫ్ట్‌వేర్‌ యాజ్‌ ఏ సర్వీస్‌ (SaaS) రంగంలో తొలి యూనికార్న్‌ ఇదే. పక్కా ఇండియన్‌ కంపెనీగా ఉంటూ నాస్‌డాక్‌లో లిస్టయిన కంపెనీ ఇది. ఒక టెలివిజన్‌ సెట్‌ను వెనక్కి ఇచ్చే సమయంలో కస్టమర్‌ సర్వీస్‌ మరీ అధ్వాన్నంగా ఉందని గమనించి…ఓ సర్వీస్‌ కంపెనీని ప్రారంభించాడు గిరీష్‌ మాతృభూతం. షాన్‌ కృష్ణస్వామితో కలిసి ఫ్రెష్‌డెస్క్‌ ప్రారంభించారు.