For Money

Business News

సోని చేతికి జీ ఎంటర్‌టైన్‌మెంట్‌

మొత్తానికి డీల్‌ కుదిరింది. మరో 90 రోజుల గడువుతో (నాన్‌ బైండింగ్‌ డీల్‌) కుదిరిన ఈ డీల్‌ ప్రకారం జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్‌ ఇండియాతో విలీనం చేస్తారు. విలీనం తరవాత ఏర్పడే కంపెనీలో సోనీ పిక్చర్స్‌కు 52.93 శాతం, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు 47.07 శాతం వాటా ఉంటుంది. ఈ డీల్‌కు రెండు కంపెనీల డైరెక్టర్ల బోర్డులు ఆమోదం తెలిపాయి. 90 రోజుల్లోగా కంపెనీల ఖాతాలను పరిశీలన పూర్తి చేసి.. తుది ఒప్పందం కుదురుతుంది. కొత్త కంపెనీకి జీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు చెందిన పునీత్‌ గోయెంకా (సుభాష్‌ చంద్ర కుమారుడు) మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓగా ఉంటారు.అయితే బోర్డులో మెజారిటీ డైరెక్టర్లను మాత్రం సోనీ నామినేట్‌ చేస్తుంది. విలీనం తరవాత కంపెనీ లిస్టెడ్‌ కంపెనీగా కొనసాగుతుంది. అంటే డీలిస్టింగ్‌ ఉండదన్నమాట.