నొయిడా సమీపంలో ఎలక్ట్రానిక్ పార్క్
ఎలక్ట్రానిక్ పరికరాలు, విడిభాగాల తయారీ కోసం యమునా ఎక్స్‌ప్రెస్ వే వెంబడి నొయిడా సమీపంలో ఎలక్ట్రానిక్ పార్క్ ఏర్పాటు చేయాలని యూపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే టాయ్ పార్క్, ఫిలిమ్ సిటీ, మెడికల్ పరికరాల తయారీ పార్క్, లెదర్ పార్క్‌లను యమునా ఎక్స్‌ప్రెస్ వే వెండి యూపీ ప్రభుత్వం నెలకొల్పుతోంది. సెక్టార్ 14 లేదా సెక్టర్ 10 ప్రాంతంలో 250 ఎకరాల్లో ఈ పార్క్ ఏర్పాటు చేయనున్నారు. ఈ పార్క్ రూ. 50,000 కోట్ల పెట్టుబడిని ఆకర్షించగలదని భావిస్తున్నారు.