పెట్రోల్, డీజిల్ జీఎస్టీలోనికా… రాష్ట్రాలు నో
పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావాలన్న ప్రతిపాదనకు రాష్ట్రాలు తిరస్కరించాయి. ఇవాళ లక్నోలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్లో ఈ ప్రతిపాదన ప్రస్తావనకు వచ్చింది. ఆరంభం నుంచి పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వీటిని జీఎస్టీలోకి తెచ్చే అంశాన్ని జీఎస్టీ కౌన్సిల్ పరిశీలించాలని కేరళ హైకోర్టు ఇటీవల చెప్పడంతో… నామ మాత్రంగా ఇవాళ ఈ ప్రతిపాదనపై చర్చ జరిగింది. అన్ని రాష్ట్రాలూ వ్యతిరేకించడంతో ఈ ప్రతిపాదన అటకెక్కింది.