For Money

Business News

తనఖా రుణాలలో వృద్ధి

దేశంలో మార్టిగేజ్‌ లోన్స్‌ శరవేగంగా వృద్ధి చెందుతున్నాయి. 1990లో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 1 శాతంగా ఉన్న తనఖా రుణాల వాటా.. ప్రస్తుతం 11 శాతానికి చేరిందని నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌ (ఎన్‌హెచ్‌బీ) తెలిపింది. దీని విలువ సుమారు రూ.27 లక్షల కోట్లుగా ఉందని ఎన్‌హెచ్‌బీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాహుల్‌ భావే తెలిపారు.
గత ఐదేళ్లుగా దేశీయ గృహ రుణ మార్కెట్‌ 30 శాతం మేర వృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. అంతకుక్రితం ఏడాదితో పోలిస్తే 2021 ఆర్థిక సంవత్సరంలో రుణ పంపిణీ 185 శాతం పెరిగిందని చెప్పారు. ఇందులో 65 శాతం లోన్లు బ్యాంక్‌లు అందించాయన్నారు. ఇప్పటివరకు దేశంలోని అన్ని హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు తెలంగాణలో రూ.17,970 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ.5,730 కోట్ల గృహ రుణాలను అందించాయి.