For Money

Business News

NIFTY TRADE: పెరిగితే నిలబడేనా?

మార్కెట్లు బలహీనంగా ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా మార్కెట్లు అనిశ్చితిని ఎదుర్కొంటున్నాయి. బైడెన్‌ కార్పొరేట్‌ పన్నులను పెంచడం ఖాయంగా కన్పిస్తోంది. ప్రపంచ మార్కెట్లన్నీ నష్టాల్లో ఉన్నా మన మార్కెట్లు మాత్రం గ్రీన్‌లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నాయి. పైకి సూచీలు గ్రీన్‌లో ఉన్నా… అనేక షేర్లలో అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఇవాళ కూడా నిఫ్టి ఏమాత్రం పెరిగినా అమ్మకాల ఒత్తిడికి ఆస్కారం ఉంది. నిఫ్టి క్రితం ముగింపు 17,380
ఇక్కడి నుంచి నిఫ్టి ఏమాత్రం పెరిగినా అమ్మడానికి అవకాశంగా భావించవచ్చు. నిఫ్టి ఇవాళ కూడా నిన్నటి మాదిరి 17,400 దాటుతుందేమో చూడండి. ఒకవేళ 17,430 ప్రాంతానికి చేరితే అమ్మండి. స్టాప్‌లాస్‌ 17,445. బహుశా నిఫ్టి ఈ స్థాయికి రావడం అనుమానమే.రిస్క్‌ తీసుకునే వారు 17,400 ప్రాంతంలోనే అమ్మొచ్చు. నిఫ్టికి మద్దతు 17,330 ప్రాంతంలో లభించవచ్చు. లేదా నేరుగా 17300కే. అక్కడ కూడా నిలబడకపోతే 17,280కి పడటం ఖాయం. నిఫ్టి ఇప్పటికీ ఓవర్‌బాట్‌లో ఉంది. కాబట్టి పెరిగితే అమ్మండి. ఎక్కడా కొననుగోలు చేయొద్దు.

ఇవి టెక్నికల్‌ అంశాలు మాత్రమే. అవగాహన కోసం రాసింది. పెట్టుబడి పెట్టే ముందు సర్టిఫైడ్‌ అనలిస్ట్‌ సలహా తీసుకోంది.