For Money

Business News

లిస్టింగ్‌ లాభాలు ఉంటాయా?

రేపు రెండు ఐపీఓలు లిస్టవుతున్నాయి. ఒకటి హైదరాబాద్‌కు చెందిన విజయా డయాగ్నస్టిక్స్‌ కాగా, రెండోది అమి ఆర్గానిక్స్‌. స్పెషాలిటీ కెమికల్స్‌ కంపెనీ అయిన అమి ఆర్గానిక్స్‌ ఐపీఓ ఏకంగా 64.54 రెట్లు అధికంగా సబ్‌ స్క్రయిబ్‌ అయింది. ఇవాళ కూడా అనధికార మార్కెట్‌లో రూ. 125 నుంచి రూ. 150 ప్రీమియం పలుకుతోంది. దీంతో రేపు లిస్టింగ్‌ ధమాకా ఖాయమని తెలుస్తోంది. ఇక విజయా డయాగ్నస్టిక్స్‌ ఇష్యూ లిస్టింగ్‌ ప్రీమియంపై అనుమానాలు ఉన్నాయి. ఇష్యూ బొటాబొటిన సబ్‌స్క్రయిబ్‌ అయింది. ముఖ్యంగా రీటైల్‌ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపలేదు. విజయా డయాగ్నస్టిక్స్‌ లిస్టింగ్‌ రోజున లాభాలు ఉంటాయా అన్న అంశంపై బ్రోకర్లలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కంపెనీ ఆఫర్‌ ధర అధికంగా పెట్టినందున.. డిమాండ్ ఉండకపోవచ్చని కొందరు అంటున్నారు. రూ. 10 లేదా రూ.20 నష్టంతో లిస్ట్‌ కావొచ్చని కూడా చెబుతున్నారు. మార్కెట్‌ మూడ్‌ కూడా డల్‌గా ఉన్నందున లిస్టింగ్‌ రోజున ఈ షేర్‌లో ప్రీమియం కష్టమని మరికొందరు అంచనా వేస్తున్నారు. వెంటనే లేకపోయినా… కొన్ని రోజుల్లో ఈ లిస్టింగ్‌లోనూ ఇన్వెస్టర్లకు లాభాలు వస్తాయని కొందరు అనలిస్టులు చెబుతున్నారు. హెల్త్‌ కేర్‌ రంగానికి చెందిన షేర్లు ముఖ్యంగా టెస్టింగ్‌ ల్యాబ్స్‌ రంగానికి చెందిన షేర్లు మార్కెట్‌లో తక్కువ ఉన్నాయని… కాబట్టి మెల్లగానైనా డిమాండ్‌ వస్తుందని మరి కొందరి అంచనా.