For Money

Business News

రూ. 5,000 పెరిగిన బంగారం

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం కోలుకుంది. 14 నెలల కనిష్ఠ స్థాయికి చేరిన బంగారానికి ఇవాళ మద్దతు లభించింది. దీంతో అమెరికా మార్కెట్‌లో ఔన్స్‌ బంగారం ధర 4.45 శాతం పెరిగి 3,675 డాలర్లకు చేరింది. అలాగే వెండి ధర కూడా 6 శాతం పైగా లాభంతో 43.55 డాలర్లపైన ట్రేడవుతోంది. ఇక మన మార్కెట్‌లో కూడా బంగారం ధరలు అమాంతంగా పెరిగాయి. ఎంసీఎక్స్‌ పది గ్రాముల బంగారం డిసెంబర్‌ కాంట్రాక్ట్‌ రూ. 1,27,119 స్థాయిని తాకింది. క్రితం ధరతో పోలిస్తే పది గ్రాముల బంగారం ధర రూ. 5000లకు పైగా పెరిగింది. ఇవాళ ఉదయం బంగారం ధర 1,23,806ని తాకింది. అక్కడి నుంచి కోలుకుని 1,27,119ని తాకింది. ఇక వెండి ధర కూడా రూ 8000లకు పైగా పెరిగింది. ఇవాళ ఉదయం ఓపెనింగ్‌లో కిలో వెండి ధర ఎంసీఎక్స్‌లో రూ. 1,49,053 ఉండగా, రూ. 1,57,614ల గరిష్ఠ స్థాయిని తాకింది. ఇది డిసెంబర్‌ కాంట్రాక్ట్‌ ధర. 2027 మార్చి కాంట్రాక్ట్‌ ధర రూ. 1,60,916ల గరిష్ఠ స్థాయిని తాకింది. ఒకవైపు పెళ్ళిళ్ళ సీజన్‌లో దేశ వ్యాప్తంగా బంగారం కొనుగోళ్ళు భారీగా పెరిగాయి. ఈనేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు భారీగా పెరగడంతో రేపు బులియన్‌ మార్కెట్‌లో రద్దీ అధికంగా ఉండే ఛాన్స్‌ ఉంది.

Leave a Reply