అధిక స్థాయిల్లో… స్థిరంగా
గిఫ్ట్ నిఫ్టి సూచించినట్లే నిఫ్టి అధిక స్థాయిలో ప్రారంభమైంది. అదే స్థాయిలో కొనసాగుతోంది. ప్రస్తుతం 25,388 పాయింట్ల వద్ద 344 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఇవాళ కూడా నిఫ్టికి అండగా బ్యాంక్ నిఫ్టి నిలిచింది. తాజా సమాచారం మేరకు బ్యాంక్ నిఫ్టి 2.64 శాతం లాభంతో 61,311 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఫైనాన్షియల్ సర్వీసెస్, ఒక శాతంపైగా లాభాలు ఆర్జించింది. స్మాల్ క్యాప్ సూచీ కూడా రెండు శాతంతో ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ధరలు భారీగా క్షీణించడంతో మార్కెట్ పాజిటివ్‌గా స్పందిస్తోంది. ఇండిగో ఇవాళ నిఫ్టి టాప్ గెయినర్‌గా నిలిచింది. ఇండిగో దాదాపు 5 శాతం లాభంతో ట్రేడవుతోంది. ఎం అండ్ ఎం, ట్రెంట్, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ షేర్లు తరువాతి టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. ఇక టాప్ లూజర్స్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ముందుంది. అయితే ఈ షేర్ నష్టాలు ఒక శాతం కన్నా తక్కువగా ఉన్నాయి. నెస్లే, అపోలో హాస్పిటల్స్, హిందాల్కో, టెక్ మహీంద్రా షేర్లు ఉన్నాయి. ఇవన్నీ నామమాత్రపు నష్టాలే. ఫలితాలు ప్రకటించిన కళ్యాణ్ జువలర్స్ దాదాపు పది శాతం లాభంతో ట్రేడవుతోంది.
