పలుదేశాల్లో కొత్త కొవిడ్ వేరియంట్..
కొవిడ్-19 కొత్త వేరియంట్ ఇపుడు టెన్షన్ పెంచుతోంది. పీజే.2.1 అనే ఈ వేరియంట్ ఇప్పటికే అనేక దేశాలకు విస్తరించింది. దీనిని గత నెల అంటే అక్టోబర్‌లో కెనడాలో గుర్తించారు. ఒంటారియో ప్రావిన్స్‌లో ఈ వైరస్ మొదలై ఉత్తర అమెరికా, యూరోప్, ఆసియాకు విస్తరించినట్లు తెలుస్తోంది. Journal of Infectionలో ఈ తాజా వైరస్‌కు సంబంధించిన వివరాలు వెల్లడి అయ్యాయి. మానవ కణాల్లోకి ప్రవేశించగలిగే సామర్థ్యం పీజే.2.1కు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఇన్ఫెక్షన్ జర్నల్ పేర్కొంది. అయితే క్లినికల్ పరంగా సరైన ఆధారాలు ప్రస్తుతం లేవని తెలిపింది. ఈ వైరస్ మ్యుటేషన్లకు ప్రత్యేక లక్షణాలను కూడా పరిశోధకులు ఇంకా గుర్తించలేదు. కొవిడ్-19 లక్షణాల మాదిరిగానే జ్వరం, శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లు కూడా ఉండవచ్చునని తెలిపింది. మరోవైపు కేవలం ఈ లక్షణాల ఆధారంగా అస్వస్థతకు కారణాన్ని గుర్తించడం సాధ్యం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.COVID-19కు కారణమైన SARS-CoV-2 సంతతికి చెందినదే PJ.2.1. అయితే జన్యపరంగా అనేక రకాల మార్పుల తరవాత వచ్చిన ఈ వేరియంట్‌ను Saltation Variantఅని అంటారు. MC.10.1.7 నుంచి ఈ కొత్త వైరస్ వచ్చినట్లు శాస్త్రవేత్తలు అంటున్నారు.
