భారీగా క్షీణించిన క్రూడ్
ఇరాన్, అమెరికాల మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలు మెరుగు కావడంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలు భారీగా తగ్గాయి. ఆసియా దేశాలు వినియోగించే బ్రెంట్ క్రూడ్ ధర 92 డాలర్ల దిగువకు వచ్చింది. అలాగే అమెరికా మార్కెట్ విక్రయించే WTI క్రూడ్ 86 డాలర్లలోపునకు వచ్చేసింది. అయితే భారత బాస్కెట్ క్రూడ్ ధర మాత్రం ఇంకా 96 డాలర్లపైనే ఉంది. క్రూడ్ ధరలతో పాటు డాలర్ కూడా క్షీణించడంతో వాల్‌స్ట్రీట్‌లో భారీ ర్యాలీ కన్పించింది. వివిధే దేశాలకు క్రూడ్ సరఫరా బాగా మెరుగుపడినట్లు వార్తలు వస్తున్నాయి. కతార్ ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్‌తో భేటీ తరవాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ఇరాన్‌పై మిలటరీ చర్యలు దాదాపు పూర్తయినట్లేనని ట్రంప్ ప్రకటించడంతో క్రూడ్ మార్కెట్ చల్లబడింది. అయితే ఇరాన్ అధికారులతో నేరుగా అమెరికా అధికారులు ఇంకా చర్చలు ప్రారంభించలేదు. మరోవైపు రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణలు వల్ల కూడా సరఫరాకు అంతరాయం కలుగుతుందనే భయాలు తగ్గుతున్నాయి. రష్యా ఇంధన మౌలిక సదుపాయాలపై ఉక్రెయిన్ తన దాడులను కొనసాగిస్తున్నా… క్రూడ్ సరఫరాపై పెద్దగా ప్రభావం కన్పించడం లేదు. ప్రపంచవ్యాప్తంగా చమురు ఉత్పత్తిలో పెరుగుదలతో పాటు సరఫరా కూడా పెరుగుతున్నట్ఉల తాజా గణాంకాలు సూచిస్తున్నాయి. ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ (ఒపెక్)పై రాయిటర్స్ నిర్వహించిన సర్వే ప్రకారం, అక్టోబర్‌లో ఒపెక్ చమురు ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ఇరాన్ యుద్ధం ముందు ఉన్న స్థాయిలలో 90 శాతానికి చమురు సరఫరా పెరిగిందని ఈ సర్వే తేల్చింది.
