For Money

Business News

స్టాండర్డ్‌ ఇంజినీరింగ్‌: సూపర్ ఫలితాలు

Q2 FY 2027లో హైదరాబాద్‌కు చెందిన స్టాండర్డ్‌ ఇంజినీరింగ్‌ ఆశాజనక ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేట్‌ ఆదాయం గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 62 శాతం పెరిగి రూ. 296.6 కోట్లకు చేరింది. ఇదే సమయంలో కంపెనీ కన్సాలిడేట్‌ నికర లాభం కూడా 38 శాతం పెరిగి రూ. 28 కోట్లకు చేరినట్లు స్టాండర్డ్‌ ఇంజినీరింగ్‌ తెలిసింది. కంపెనీ ఎబిటా 80 శాతం పెరిగి రూ. 51.4 కోట్లకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో అంటే తొలి ఆరు నెలల్లో కంపెనీ రూ. 544 కోట్ల ఆదాయాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే కంపెనీ ఆదాయం 53 శాతం పెరిగింది. ఎబిటా 57 శాతం పెరిగి రూ. 91 కోట్లకు చేరింది. కంపెనీ నికర లాభం కూడా 32 శాతం పెరిగి రూ. 54.9 కోట్లకు చేరినట్లు స్టాండర్డ్‌ ఇంజినీరింగ్‌ తెలిపింది. అరబిందో, సిప్లా, సన్‌ ఫార్మా, డాక్టర్‌ రెడ్డీస్‌ వంటి ప్రధాన కంపెనీలకు తాము సేవలు అందిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. జపాన్‌ కంపెనీ GL Hakkoలో 19 శాతం వాటా తీసుకున్న కంపెనీ త్వరలోనే దీన్ని 51 శాతానికి పెంచనుంది.
డేటా విభాగంలో…
కంపెనీ 2.73 లక్షల చదరపు అడుగుల గిగా స్కేల్‌ ఫ్యాక్టీరీ డిసెంబర్‌కల్లా రెడీ అవుతుందని స్టాండర్డ్‌ ఇంజనీరింగ్‌ పేర్కొంది. దీని కోసం రూ. 487 కోట్లను అంతర్గతంగాన సమకూర్చుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. కంపెనీకి ఎలాంటి రుణాలు లేవని పేర్కొంది. అలాగే ఏడు పవర్‌, 5 కూలింగ్‌ ప్రాజెక్టులు, ఇతక టర్న్‌కీ ప్రాజెక్టులు అమలులో ఉన్నాయని పేర్కొంది. జీ స్కేల్‌ ఎనర్జీలో 51 శాతం వాటా తీసుకోవాలని కంపెనీ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో33.55 శాతం తీసుకున్నామని, మరో 17.45 శాతం వాటా కొనేందుకు ఎక్స్ఛేంజీ అనుమతి కోసం ఎదరు చూస్తున్నామని పేర్కొంది.

Leave a Reply