For Money

Business News

భారీ నష్టాల నుంచి గ్రీన్‌లోకి….

ఉదయం ఒక దశలో రెండు శాతంపైగా నష్టపోయిన నాస్‌డాక్‌ ఇపుడు లాభాల్లో ట్రేడవుతోంది. అలాగే డౌజోన్స్‌, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీలు కూడా గ్రీన్‌లోకి వచ్చాయి. మధ్యంతర ఎన్నికల్లో వచ్చిన ప్రారంభ ఫలితాలు చూసిన మార్కెట్‌…. పరిస్థితి గందరగోళంగా తయారవుతుందని మార్కెట్‌ భావించింది. అయితే సెనేట్‌తోపాటు ప్రజా ప్రతినిధుల సభలో కూడా డెమొక్రటిక్‌ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రావడంతో… అధ్యక్షుడు ట్రంప్‌ దిగి వచ్చాడు. విపక్షాలు చక్కటి ప్రచారంతో రాణించారని, డెమొక్రాట్స్‌తో కలిసి ముందుకు సాగుతానని, తాను వీటో ఉపయోగించే పరిస్థితి రాకపోవచ్చని ట్రంప్‌ స్పష్టం చేశారు. గవర్నర్లలో కూడా మెజారిటీ స్థానాలు డెమొక్రటిక్‌లకు రావడంతో… రాజకీయ అస్థిరత తగ్గిందని అనలిస్టులు అంటున్నారు. స్పష్టమైన మెజారిటీ రావడంతో… ట్రంప్‌ విధానాల్లో మార్పు వస్తుందని వీరు భావిస్తున్నారు. చాలా వరకు షేర్లు కోలుకున్నా… ట్రంప్‌ మద్దతుదారుల కంపెనీలకు చెందిన షేర్లలో అమ్మకాల ఒత్తిడి కన్పిస్తోంది. ఎలాన్‌ మస్క్‌కు చెందిన టెస్లా, స్పేస్‌ఎక్స్‌ షేర్లు ఫ్యూచర్‌ మార్కెట్‌లో నష్టాల్లో ట్రేడవుతున్నాయి. తాజా ట్రెండ్స్‌ ప్రకారం సెనేట్‌ మెజారిటీకి 50 స్థానాలు అవసరం కాగా, డెమొక్రాట్లు ఇప్పటికే 54 స్థానాలు గెలుపొందినట్లు బీబీసీ పేర్కొంది. అలాగే ప్రజా ప్రతినిధుల సభ.. కాంగ్రెస్‌లో మెజారిటీ సంఖ్య 218 కాగా, డెమొక్రాట్ల సంఖ్య ఇప్పటికే 228 దాటినట్లు బీబీసీ పేర్కొంది. ఇక గవర్నర్ల విషయానికొస్తే 27 డెమొక్రాట్లు, 20 స్థానాల్లో రిపబ్లికన్లు గెలిచారు.

Leave a Reply