డెమొక్రట్ల చేతికి ప్రతినిధుల సభ, సెనేట్
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ పార్టీ ఘోర పరాభావాన్ని ఎదుర్కోనుంది. అనేక చోట్ల రిపబ్లికన్ పార్టీ చతికిలపడింది. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలను చూస్తే ప్రజా ప్రతినిధుల సభతో పాటు సెనేట్ కూడా డెమొక్రట్ల పరం కానుంది. బీబీసీ తాజా సమాచారం మేరకు సెనేట్‌లో పూర్తి మెజారిటీకి 50 సీట్లు అవసరం కాగా డెమొక్రట్ పార్టీ అభ్యర్థులు 50 స్థానాలు గెలిచారు. ఇక ప్రజాప్రతినిధుల సభలో 93 మంది రిపబ్లికన్లు గెలవగా, డెమొక్రట్ పార్టీ స్కోర్ 141 దాటింది. దీంతో ప్రజా ప్రతినిధుల సభ మళ్ళీ డెమొక్రట్ల చేతికి వచ్చేసింది. సెనేట్ కూడా రావడంతో ఇపుడు అందరి దృష్టి గవర్నర్లపై పడింది. కీలక స్థానాలను రిపబ్లికన్ల నుంచి డెమొక్రట్లు లాక్కోవడం విశేషం. దాదాపు 30 ఏళ్ళ తరవాత సౌత్ కరోలినాలో డెమొక్రటిక్ సెనేటర్ గెలిచారు. అలాగే నార్త్ కరోలినాలో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి రాయ్ కూపర్ గెలిచారు. జార్జియాలో ఆసాఫ్ గెలుపుతో డెమొక్రట్ల జైత్రయాత్ర మొదలైంది. ట్రంప్ పార్టీ ఓడిపోతుండటంతో వాల్‌స్ట్రీట్‌లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా నాస్‌డాక్ రెండు శాతంపైగా నష్టపోయింది.
