ముందే దీపావళి జోష్
దీపావళి ముందు మార్కెట్‌లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా క్రూడ్ దిగి రావడం, LTCGపై సెబి సానుకూల నిర్ణయం తీసుకోవడం ప్రధానమైన అంశాలుగా చెప్పొచ్చు. LTCG నుంచి విదేశీ ఇన్వెస్టర్లను మినహాయించాలంటూ సెబి సిఫారసు చేసింది. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా సానుకూలంగా స్పందించారు. వెంటనే దీనిపై నిర్ణయం ఉంటుందా లేదా వచ్చే బడ్జెట్‌లో ప్రకటిస్తారా అన్న అంశంపై క్లారిటీ లేదు. గత అయిదు రోజుల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు నికరంగా మార్కెట్‌లో షేర్లు కొంటున్నారు. ఇతర మార్కెట్లలో ఏఐ షేర్లలో వస్తున్న కరెక్షన్ కారణంగా మన మార్కెట్‌లో పెట్టబడులు పెడుతున్నారా లేదా ట్యాక్స్ మినహాయింపునకు పాజిటివ్‌గా స్పందిస్తున్నారా అన్నది తెలియదు. మరోవైపు ఇజ్రాయిల్ ఎన్నికల్లో అధికార పార్టీ ఓడిపోవడం, అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ పార్టీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోందంటూ వస్తున్న వార్తల కారణంగా యుద్ధ ప్రభావం కాస్త తగ్గినట్లు కన్పిస్తోంది. ఇరాన్, అమెరికా మధ్య మళ్ళీ చర్చలు జరుగుతాయన్న వార్తలు కూడా వస్తున్నాయి. అమెరికా మధ్యంతర ఎన్నికల తరవాత దీనిపై క్లారిటీ వచ్చే అవకాశముంది. ప్రస్తుతానికి క్రూడ్ తగ్గడంతో మన మార్కెట్ పాజిటివ్‌గా స్పందిస్తోంది. ఇవాళ నిఫ్టి వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్ ఉంది. ఒక వేళ కొనుగోళ్ళ ఆసక్తి కొనసాగితే… షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. అదే జరిగితే నిఫ్టి తన తొలి ప్రధాన రిసెస్టిన్స్ లెవల్ 23,600ని తాకే వీలు ఉంది. మరి అక్కడి నుంచి నిఫ్టి పయనం గురించి టెక్నికల్ అనలిస్టుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. నిఫ్టికి ఈ స్థాయిలో కాస్త కరెక్షన్ రావొచ్చని చాలా మంది అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఏఐ షేర్లు పడుతున్నా…మన ఐటీ షేర్లలో మునుపటి ఉత్సాహం కన్పించడం లేదు. కోప్సి మూడు శాతంపైగా నష్టంతో ఉంది. ఇవాళ ఐటీ నిఫ్టి పెరుగుతుందేమో చూడాలి. చాలా మంది అనలిస్టులు అధిక స్థాయి వద్ద తక్షణం బయటపడాలని, తరవాత పడినపుడు రీ ఎంట్రీ తీసుకోవాలని అంటున్నారు. మరి మార్కెట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
