For Money

Business News

రూ. 2,350ని టచ్‌ చేసిన లారస్‌ ల్యాబ్‌

రీసెర్చి బ్రోకింగ్‌ సంస్థలు లారస్‌ ల్యాబ్‌కు నెగిటివ్‌ రిపోర్ట్‌లు ఉవ్వకున్నా… ధర టార్గెట్‌ విషయంలో చాలా నిక్కచ్చిగా ఉన్నాయి. గత కొన్ని రోజుల నుంచి వరుసగా పెరుగుతూ వస్తున్న లారస్‌ ల్యాబ్‌ షేర్‌ కొత్త గరిష్ఠ స్థాయిలను తాకుతోంది. అయితే బ్రోకింగ్‌ సంస్థలు మాత్రం… కంపెనీ విస్తరణ సామర్థ్యం అందుబాటులోకి వచ్చేంత వరకు వ్యాల్యుయేషన్‌ పెంచడం లేదు. ధర టార్గెట్‌ రూ. 2,100గా పేర్కొన్నాయి. నిజానికి ఇది కూడా పెంచడమే. ఇంతకుమునుపు బ్రోకింగ్‌ సంస్థల టార్గెట్‌ రూ 1800 ప్రాంతంలో ఉండేది. తాజా ఫలితాలు కూడా ఆశాజనకంగా ఉన్నా…. వ్యాల్యుయేషన్‌ విషయంలో జాగ్రత్తగా ఉన్నాయి. సెప్టెంబర్‌ నెలాఖరు వరకు డాలర్‌తో రూపాయి చాలా బలహీనంగా ఉండటంతో ఫార్మా కంపెనీలకు బాగా కలిసి వచ్చింది. ముఖ్యంగా CMDO రంగంలోని కంపెనీలు బాగా రాణించాయి. మార్కెట్‌లోని దాదాపు అన్ని రంగాలు ఇటీవల దారుణ నష్టాలు మూటగట్టుకున్నాయి. డాలర్లపై ఆధారపడిన ఐటీ కంపెనీలు ఇటీవల కాస్త రాణిస్తున్నా… ఆర్డర్లు పెరగకపోవడం, ఏఐ కాంట్రాక్ట్‌లు దాదాపు లేకపోవడంతో తాజాగా కొనేందుకు ఇన్వెస్టర్లు జంకుతున్నారు. ఈ నేపథ్యంలో ఫార్మా రంగం చాలా మంది ఇన్వెస్టర్లను కాపాడింది. ఈ నేపథ్యంలో లారస్‌ ల్యాబ్‌ ఇవాళ రూ. 2,350ని క్రాస్‌ చేసింది. మరి ఇక్కడి నుంచి ఎంత వరకు ఈ షేర్‌ పెరుగుతుందనే అంశంపై భిన్నాభిప్రాయలు ఉన్నాయి. టెక్నికల్‌గా చూస్తే మాత్రం లారస్‌ ల్యాబ్‌ షేర్‌ …. ఆల్‌టైమ్‌ గరిష్టానికి చేరినట్లే. ఫిబ్రవరి, మార్చి మనిహాయిస్తే… 2024 నవంబర్ నుంచి మంత్లి ఇండికేటర్‌ గ్రీన్‌లోనే ఉంది. కాస్త కరక్షన్‌ తరవాతే కొత్త గరిష్ఠానికి ఛాన్స్‌ ఉందని అనలిస్టులు అంటున్నారు. ఈ స్థాయిలో కొనే కన్నా… కాస్త ఆగి స్వల్ప కరెక్షన్‌ తరవాత కొనడం బెటర్‌ అని వీరు అంటున్నారు.

Leave a Reply