For Money

Business News

బినాన్స్‌ హ్యాకింగ్‌తో కలకలం

కొన్ని గంటల్లో కొన్ని కోట్ల డాలర్ల విలువైన క్రిప్టో కాయిన్స్‌ మాయమైపోయాయి. ఒక ఇంజినీర్‌ ల్యాప్‌ట్యాప్‌ హ్యాక్‌ కావడంతో క్షణాల్లో లక్షల కోట్ల బినాన్స్‌ కాయిన్స్‌ మరో ఖాతాకు తరలిపోయాయి. ఏకంగా 630 కోట్ల డాలర్ల విలువైన క్రిప్టో ఆస్తులు హ్యాక్‌ అయినట్లు బినాన్స్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. దీంతో క్రిప్టో మార్కెట్‌లో అమ్మకాలు వెల్లువెత్తాయి. బిట్‌కాయిన్, ఈథర్‌తో పాటు పలు ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువ భారీగా క్షీణించింది. ముఖ్యంగా ఫార్వర్డ్‌ మార్కెట్‌లో నష్టాలు తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. బిట్‌ కాయిన్‌, ఈథర్‌ రేట్లు పెరుగుతాయంటూ కొన్న కాంట్రాక్ట్‌ల విలువ అమాంతంగా పడిపోయింది. క్రిప్టో ధరలపై ఒత్తిడి ఇంకా కొనసాగే అవకాశముందని స్టాండర్డ్ చార్టర్డ్ హెచ్చరించింది. బిట్‌కాయిన్‌తో పాటు ఇతర ప్రధాన కాయిన్‌లు పడిపోవడంతో సుమారు 100 కోట్ల డాలర్లకు పైగా విలువైన లెవరేజ్డ్ ఫ్యూచర్స్ బెట్‌లు లిక్విడేట్ అయ్యాయని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. హ్యాకింగ్‌తో క్రిప్టో మార్కెట్‌పై విశ్వాసం తగ్గిందని, మున్ముందు కూడా నష్టం ఉంటుందని స్టాండర్డ్ చార్టర్డ్ హెచ్చరించింది.

బిట్‌కాయిన్ 3% పైగా క్షీణించి 76,000 డాలర్లకు క్షీణించింది. ఈథర్ 2,237డాలర్లకు, BNB 717.32 డారల్లకు పడిపోయాయి. XRP సోలానా ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. స్పాట్‌ మార్కెట్‌ కన్నా ఫార్వర్డ్‌ మార్కెట్‌లో భీతావహ పరిస్థితి నెలకొంది. మొత్తం లిక్విడేషన్లు 150 కోట్ల డాలర్లను మించినట్లు తెలుస్తోంది. హ్యాకింగ్‌ కారణంగా 630 కోట్ల డాలర్ల విలువైన క్రిప్టో ఆస్తులు ప్రభావితమయ్యాయని బైనాన్స్ తెలిపింది. 2025లో 150 కోట్ల డాలర్ల క్రిప్టో హ్యాక్‌ దక్షిణ కొరియాలో జరిగింది. “ఇది హ్యాక్‌లాగే కనిపిస్తోంది,” అని బైనాన్స్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ చాంగ్‌పెంగ్ జావో Xలో అన్నారు. హ్యాకింగ్‌ జరిగినట్లు తెలియగానే తమ ఆస్తుల ట్రేడింగ్‌ను బినాన్స్‌ ఆపేసింది.

Leave a Reply