For Money

Business News

రెవెన్యూ లోటు: ఏపీకి రూ. 1,438 కోట్లు

17 రాష్ట్రాల రెవెన్యూ లోటు భర్తీకి కేంద్ర ప్రభుత్వం ఇవాళ నిధులను విడుదల చేసింది. 17 రాష్ట్రాలకు రూ.9,871 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ఏపీకి రూ.1,438 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం పేర్కొంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఏపీకి మొత్తంగా రూ.8,628.50 కోట్లు విడుదల చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల రెవెన్యూ లోటు భర్తీకి మొత్తం ఇప్పటివరకు రూ.59,226 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.