12 మంది మృతి… సౌదీ ప్రకటన
యెమెన్‌కు చెందిన హౌతీలు జరిపిన దాడిలో 12 మంది మరణించినట్లు సౌదీ అరేబియా అధికారికంగా ప్రకటించింది. సౌదీ రాజధాని రియాద్‌లోని కింగ్ ఖాలిద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌పై నిన్న హౌతీలు క్షిపణులతో విరుచుకుపడ్డారు. ఇందులో 12 మంది మరణించగా, 309 మంది గాయపడ్డారని సౌదీ అరేబియా ప్రకటించింది. మృతి చెందినవారిలో నలుగురు సౌదీలు, బంగ్లాదేశ్‌కు చెందిన ఇద్దరు ఉన్నారు. అలాగే అమెరికా, జోర్డాన్, పాలస్తీనా, సిరియా, సూడాన్, ఈజిప్ట్‌లకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారని సౌదీ పౌర విమానయాన సంస్థ తెలిపింది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని ఆ సంస్థ తెలిపింది.దాడి తరవాత కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలను నిలిపివేశారు. గత వారం రోజుల్లో హౌతీలు జరిపిన దాడుల్లో ఆరుగురు మృతి చెందారు. హౌతీల దాడి “యుద్ధ నేరం”గా సౌదీ అరేబియో పేర్కొంది. దీనికి ప్రతిగా త్వరలోనే సైనిక కూటమి ప్రతీకారం తీర్చుకుంటుందని తెలిపింది. సౌదీ అరేబియాపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో తెలిపారు. తాజా దాడుల్లో ఒక అమెరికన్ పౌరుడు మరణించినట్లు ఆయన ధృవీకరించారు.
