ఈ లాభాలు నిలడుతాయా?
నష్టాలతో విసిగి పోయిన ఇన్వెస్టర్లకు ఇవాళ గిఫ్ట్ నిఫ్టి గ్రీన్ సిగ్నల్ కాస్త ఊరట కల్గిస్తోంది. అమెరికాలో వడ్దీ రేట్లను పెంచే ఛాన్స్ తక్కువంటూ వస్తున్న వార్తలకు మార్కెట్లు పాజిటివ్‌గా స్పందిస్తున్నాయి. గత వారం భారీ లాభాలతో వాల్‌స్ట్రీట్ ముగియడానికి కారణం కూడా ఇదే. జాబ్ డేటా అనుకున్న స్థాయిలో భారీగా లేకపోవడంతో… ఫెడ్ ఈనెల 7న వడ్డీ రేట్లను పెంచకపోవచ్చని భావిస్తున్నారు. అలాగే క్రూడ్ ధరల్లో కాస్త నిలకడ కన్పిస్తోంది. పైగా గతవారం మన ఐటీ షేర్ల ఏడీఆర్‌లు ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. దీంతోమన నిఫ్టి ఇవాళ లాభాల్లో కొనసాగే అవకాశముంది. అయితే క్రూడ్ వంద డాలర్లపైనే ఉండటం, 10ఏళ్ళ అమెరికా బాండ్ ఈల్డ్స్ ఇంకా 5.2 శాతంపైనే ఉండటంతో ఇవాళ్టి లాభాలు ఎంత వరకు ఉంటాయనేది చూడాలి. ఎందుకంటే మార్కెట్‌లో వస్తున్న బిజినెస్‌అప్‌డేట్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయి. గత ఏడాది త్రైమాసికంతో ఇపుడు పోల్చి చాలా కంపెనీలు పాజిటివ్ న్యూస్ ఇస్తున్నాయి. కాని గత త్రైమాసికంతో పోలిస్తే ఫలితాలు ఉత్సాహంగా లేవని తెలుస్తోంది. ఒక్కో కంపెనీని బట్టి ఫలితాలను బేరేజు వేసుకోవాల్సిందే. మరోవైపు HDFC BANK షేరుకు కొనుగోలు చేయాల్సిందిగా అనేక సంస్థల నుంచి రెకమెండేషన్ల వస్తున్నాయి. బ్యాంక్‌కు బాగ్జి కొత్త సీఈఓగా రావడం, బిజినెస్ అప్‌డేట్స్ ఆకర్షణీయగా కన్పిస్తున్నాయి. దీంతో ఈ షేర్ వెలుగులో ఉండే ఛాన్స్ ఉంది. అనేక బ్రెకింగ్ సంస్థలు ఈ షేర్ 50 శాతంపైగా పెరుగుతుందని అంటున్నాయి. ఇతర ఆసియా మార్కెట్ల లాభాలతో పోలిస్తే మన మార్కెట్ల లాభాలు నామమాత్రంగా కన్పిస్తున్నాయి. గత వారాంతంలో ఆర్బీఐ గవర్నర్ మాట్లాడుతూ చేసిన ప్రసంగం… మార్కెట్‌కు షాక్‌కు గురి చేసింది. ఏఐ షేర్లలోసంక్షోభం వస్తే మన ఐటీ షేర్లు పెరుగుతాయని ఆయన చెప్పడం విడ్డూరంగా ఉంది. మనం సొంతంగా ఎదగడం పక్కన పెట్టి… ఇతర దేశాల్లో నాశనమైతే… మనం బాగుపడుతామని చెప్పడం విచిత్రమని విమర్శలు వస్తున్నాయి. మొత్తానికి ఇవాళ్టి గ్రీన్ ఎంత వరకు ఉంటుందో చూడాలి మరి.
