రూ.4,000 దాకా పడిన పసిడి
అంతర్జాతీయ మార్కెట్‌లో బులియన్ పై ఒత్తిడి తీవ్రంగా ఉంటోంది. బంగారంతో పాటు వెండిలో కూడా అమ్మకాలు జోరుగా ఉన్నాయి. అమెరికా మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 4200 డాలర్ల దిగువకు వచ్చేసింది. ఇపుడు 4,173 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అలాగే వెండి కూడా. వెండి ధర దాదాపు అయిదు శాతం క్షీణించి 61.78 డాలర్ల వద్ద ఉంటోంది. బంగారానికి 4200 డాలర్లు, వెండికి 62 డాలర్లు ఎప్పటి నుంచో గట్టి మద్దతుగా ఉండేవి. డాలర్ ఇండెక్స్ బలపడంతో పాటు క్రూడ్ ధరలు భారీగా పెరగడంతో బులియన్‌లో ఒత్తిడి పెరిగింది.
ఇక మన మార్కెట్‌లో కూడా బంగారం ధరలు గణనీయంగా తగ్గాయి. MCXలో అక్టోబర్ కాంట్రాక్ట్ ఇవాళ ఏకంగా రూ. 4000 తగ్గి రూ. 1,46,749ని తాకింది. ఇపుడు లక్షా 47 వేలకుపైగా ట్రేడవుతోంది. ఇక వెండి ధర కూడా రూ. 8000 దాకా తగ్గి రూ. 2.26 లక్షలకు చేరింది. ఇపుడు రూ. 7000 నష్టంతో రూ. 2.27 లక్షల వద్ద ట్రేడవుతోంది.
