NIFTY TRADE: పెరిగితే అమ్మడమే
ఇవాళ వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ) మీటింగ్ ఉంది. ప్రపంచ మార్కెట్లన్నీ నష్టాలతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి 50 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. నిఫ్టి క్రితం ముగింపు 17,353. సింగపూర్ నిఫ్టి స్థాయిలోనే నిఫ్టి ప్రారంభమయ్యే పక్షంలో 17,300 ప్రాంతంలో మార్కెట్ ప్రారంభం కావొచ్చు. ఒకే వేళ నిఫ్టి గనుక పెరిగే పక్షంలో 17,330, 17,380 ప్రాంతానికి చేరుతుందేమో చూడండి. ఒకేవేళ ఇక్కడ గనుక ఛాన్స్ వస్తే అమ్మండి. నిఫ్టి ఏమాత్రం పెరిగినా అమ్మండి. చైనా పెట్టుబడులు భారత్‌కు రావడం వల్ల ఇక్కడ సూచీలు పెరిగాయి. కాని పరిస్థితి మారుతోంది. చైనా ఏ క్షణమైనా తన వైఖరి మార్చుకుంటే.. మన మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి అధికంగా ఉంటుంది. కాబట్టి అధిక స్థాయిలో అమ్మి… స్వల్ప లాభాలతో బయటపడండి. పై స్థాయిలో నిఫ్టి నిలబడటక పోవడానికి ప్రధాన కారణం… నిఫ్టి ఓవర్ బాట్ స్థాయిలో ఉండటం. నిఫ్టి 17,330 దిగువకు వస్తే 17280, 17,225,17,156లను గమనించండి. 17,265-17,225 ప్రాంతంలో బయటపడండి. ఏ స్థాయిలోనూ కొనుగోలు చేయొద్దు. చిన్న ఇన్వెస్టర్లు ఇవాళ ట్రేడింగ్ చేయకపోవడమే బెటర్. ఇది డే ట్రేడర్స్‌కు మాత్రమే. పొజిషనల్ ట్రేడర్స్‌కు మాత్రమే.
ఇది సాంకేతిక అంశాల ద్వారా మార్కెట్ చలనం అంచనా మాత్రమే. పెట్టుబడిపై నిర్ణయం తీసుకునేందుకు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ సలహా తీసుకోండి.