For Money

Business News

డేంజర్‌ జోన్‌లో 23,200

అనుకున్నట్లే IRDAI ముసాయిదా పత్రం మార్కెట్‌లో కలకలం రేపింది. బీమా కంపెనీలు వసూలు చేసే కమీషన్లపై నియంత్రణ విధించాంటూ IRDAI విడుదల చేసిన ముసాయిదా పత్రంతో ప్రముఖ ప్రైవేట్‌ బీమా కంపెనీల షేర్లు భారీగా క్షీణించాయి. ముఖ్యంగా ఆన్‌లైన్‌ ద్వారా బీమా పాలసీలు అమ్ముతున్న పీబీ ఫిన్‌టెక్‌, టర్టల్‌మింట్‌ షేర్లు భారీగా నష్టపోయాయి. టర్టల్‌ మింట్‌ షేర్‌ ఏకంగా 20 శాతం లోయర్‌ సీలింగ్‌ వద్ద ట్రేడవుతోంది. అలాగే పీబీ ఫిన్‌టెక్‌ ప్రస్తుతానికి 15 శాతం లోయర్‌ సీలింగ్‌ వద్ద ఉంది. ICICI Prudential Life, Star Health, HDFC Life షేర్లు 5 నుంచి 8 శాతం దాకా నష్టంతో ట్రేడవుతున్నాయి. SBI Life నష్టాల నుంచి గ్రీన్‌లోకి వచ్చింది. ఇక LIC స్థిరంగా గ్రీన్‌లో ఉంది. మరోవైపు నిఫ్టి ఇవాళ 23205ని టచ్‌ చేసింది. ఏకంగా 235 పాయింట్ల నష్టంతో నిఫ్టి ఇన్వెస్టర్లకు షాక్‌ ఇచ్చింది. ఇపుడు 220 పాయింట్ల నష్టంతో 23226 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టి బ్యాంక్‌ 1.7 శాతం, నిఫ్టి ఫైనాన్స్‌ సూచీ 1.78 శాతం నష్టపోగా, మిడ్‌ సెలెక్ట్‌ రెండు శాతం నష్టపోయింది. నిఫ్టి టాప్‌ లూజర్స్‌లో HDFC Life టాప్‌లో ఉంది. బజాజ్‌ ఫైనాన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హిందాల్కో తరవాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక నిఫ్టి టాప్‌ గెయినర్స్‌లో SBI life టాప్‌లో ఉంది. టెక్‌ మహీంద్రా, ఎటర్నల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, సన్‌ ఫార్మా తరవాతి స్థానాల్లో ఉన్నాయి. ఇవన్నీ నామమాత్రపు లాభాల్లో ఉన్నాయి.

Leave a Reply