అన్ని అపశకునాలే…
దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? స్టాక్ మార్కెట్లు ఎలా ఉన్నాయి? ప్రపంచ మార్కెట్లు ఎలా ఉన్నాయి? ఇవేవీ చూడకుండానే మన దేశంలో వ్యవస్థలు పనిచేస్తున్నాయి. ప్రపంచంలోనే అతి తక్కువ రిటర్న్స్ ఇచ్చిన మార్కెట్‌గా మన మార్కెట్‌కు చెత్త రికార్డు వచ్చింది. రోజు రోజుకూ చిక్కిపోతున్న మార్కెట్‌పై ఇవాళ IRDAI తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యం కల్గిస్తోంది. మార్కెట్ చాలా బలహీనంగా ఉన్న సమయంలో బీమా కంపెనీలకు సంబంధించి ఇరేడా ఇతీసుకున్న నిర్ణయం నెగిటివ్‌గా మారింది. దాదాపు అన్ని బీమా కంపెనీలు ఏకంగా పది శాతంపైగా నష్టంతో ప్రారంభం కానున్నాయి.కొన్ని కౌంటర్లు 20 శాతం నష్టంతో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఇలాంటి ముసాయిదా పత్రాలతోనే NBFC షేర్లను సర్వనాశనం చేశారు. ఇపుడు బీమా కంపెనీలపై పడ్డారు. కంపెనీలు ఇస్తున్న కమీషన్ల వల్ల కూడా బీమా వసూళ్ళు పెరగడం లేదు. ఇలాంటి సమయంలో కమీషన్లకు కళ్ళెం వేస్తూ IRDAI ఇవాళ ముసాయిదా పత్రం విడుదల చేసింది. మరి తుది నిర్ణయాలు ఎలా ఉంటాయేమోగాని… ఈలోగా మార్కెట్లో బీమా కంపెనీలు భారీ నష్టాలు మూటగట్టుకుంటున్నాయి.
