పబ్లిక్ ఇష్యూకు సచిన్ కంపెనీ
క్రికెట్ దగ్గిజం సచిన్ టెండూల్కర్ మద్దతు ఉన్నస్పిన్నీ కంపెనీ పబ్లిక్ ఇష్యూకు రానుంది. 2021లో ఆయన ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టారు. ఆ తరవాత ఈ కంపెనీ యూనికార్న్‌గా మారింది. టైగర్ గ్లోబల్, యాక్సెల్ లీడర్స్ ఫండ్‌తో పాటు అవెనీర్ గ్రోత్, అబుదాబికి చెందిన ఏడీక్యూ కూడా ఇందులో పెట్టుబడి పెట్టాయి. 2026లో ఈ కంపెనీ టర్నోవర్ రూ.6000 కోట్లకు చేరుతుందని భావిస్తున్నారు. 25 నగరాల్లో విస్తరించిన ఈ కంపెనీ నెలకు 15వేల కార్లను అమ్ముతోంది. యూజ్డ్ కార్ మార్కెట్‌లో రాణిస్తున్న ఈ కంపెనీ గత ఆగస్టులోనే ప్రైవేట్ నుంచి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారింది. మార్కెట్ నుంచి రూ. 3000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఈ మేరకు సెబీ వద్ద పత్రాలు దాఖలు చేసింది. గత ఏడాది రూ. 4657 కోట్ల టర్నోవర్ సాధించిన ఈ కంపెనీ ఏటా 25 శాతం వృద్ధితో సాగుతోంది. కంపెనీని మరింత విస్తరించేందుకు నిధుల సమీకరణకు మార్కెట్‌కు వస్తోంది. కొత్తగా షేర్ల జారీతో పాటు ఇపుడున్న ఇన్వెస్టర్లు కూడా తమ వాటాలో కొంత భాగాన్ని ఇష్యూలో భాగంగా అమ్మనున్నారు. 2027లో పబ్లిక్ ఆఫర్‌కు ఈ కంపెనీ రానుంది.
