మార్కెట్ జోరు.. మరి ఐటీ?
ఇవాళ కూడా నిఫ్టి లాభాలతో ప్రారంభం కానుంది. ప్రతిరోజూ నిఫ్టి ఒక రేంజ్ లోపల ట్రేడవుతోంది. వంద పాయింట్లు పెరగడం గగనంగా మారింది. ఈ నేపథ్యంలో ఇవాళ నిఫ్టి 23,500 రెసిస్టెన్స్‌ను ఎదుర్కోనుంది. పైగా ఇవాళ నిఫ్టి వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్. రాత్రి తగ్గినట్లే తగ్గిన క్రూడ్ ఆయిల్ ఇవాళ మళ్ళీ పెరిగింది. 101 డాలర్లకు చేరువలో ఉంది బ్రెంట్ క్రూడ్. డాలర్ కూడా పెరగడంతో మనపై కాస్త ఒత్తిడి ఉండొచ్చు. అయితే రాత్రి వాల్‌స్ట్రీట్‌లో ముఖ్యంగా ఏఐ, చిప్ షేర్లలో వచ్చిన దూకుడు చూస్తుంటే… ఇవాళ మన మార్కెట్లో న్యూఏజ్ షేర్లలో సందడి నెలకొనొచ్చు. మరి ఐటీ షేర్లపై ఒత్తిడి ఉంటుందా? చూడాలి. ఎందుకంటే ఐటీలో కూడా ఏఐని అందింపుచ్చుకుంటున్న మిడ్ క్యాప్ షేర్లు పాజిటివ్‌గా ఉంటున్నాయి. ఈ తేడాను ఇన్వెస్టర్లు గమనించాలి. న్యూఏజ్ షేర్ల నుంచి ఇన్వెస్టర్లు అవగాహన పెంచుకోవడం కూడా అవసరం. ఇక ఇవాళ మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలు పెద్దగా లేవు. అయితే న్యూఏజ్ షేర్ల ర్యాలీని గమనించవచ్చు. ఈ షేర్లు ప్రధాన సూచీల్లో లేవు కాబట్టి. నిఫ్టి ఆల్ఫా సూచీని గమనించడం బెటర్. తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల కారణంగా విద్యుత్ డిమాండ్ బాగా పెరుగుతోంది. చాలా ప్లాంట్ల వద్ద బొగ్గు నిల్వలు తగ్గిపోతున్నాయి. కాబట్టి కోల్ ఇండియాను గమనించండి. అలాగే ఎన్టీపీసీ, ఎన్టీపీసీ గ్రీన్ షేర్లు కూడా. లోకల్ షేర్లను చూస్తే… అపోలో మైక్రోలో ర్యాలీ కొనసాగే ఛాన్స్ ఉంది. ESDS షేర్లు నిన్న అప్పర్ సీలింగ్‌లో ముగిశాయి. ఇవాళ కూడా అదే పరిస్థితి రావొచ్చు. ఇక స్టాండర్డ్ ఇంజినీరింగ్ కూడా క్రమంగా ఆల్‌టైమ్ హైని తాకే ఛాన్స్ ఉంది. ఇక ఫార్మా షేర్లలో ర్యాలీ కొనసాగుతోంది. ముఖ్యంగా SMS ఫార్మా రోజు కొంత పెరుగుతోంది.
