లాభాల్లో ప్రారంభమైనా…
ఇవాళ మార్కెట్ లాభాలతో ప్రారంభం కానుంది. రాత్రి అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిసినా… ఇపుడు ఫ్యూచర్స్ గ్రీన్‌లో ఉన్నాయి. అలాగే ఆసియా మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. ఏఐ షేర్లలోపెద్దగా ఒత్తిడి లేదు. అయితే క్రూడ్ ధరలే మన మార్కెట్‌ను బెంబేలెత్తిస్తున్నాయి. తాజా సమాచారం మేరకు మన క్రూడ్ బాస్కెట్ ధర 130 డాలర్లను దాటినట్లు తెలుస్తోంది. పైగా సౌదీపై హుతీల దాడితో పరిస్థితి చేయిదాటి పోయింది. ఏకంగా మక్కా ప్రాంతాన్నే హుతీలు టార్గెట్ చేయడంతో సౌదీ ప్రతిస్పందన ఎలా ఉంటుందో చూడాలి. మరోవైపు యూరప్ దేశాలకు సౌదీ క్రూడ్ సరఫరాను ఆపేసింది. లబియా కూడా తన ఎగుమతులను ఆపింది. ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ నిల్వలు భారీగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో వడ్డీ రేట్లు కూడా పెరగనున్నాయి. క్రూడ్ దెబ్బతో మన మార్కెట్‌లో ఎన్‌బీఎఫ్‌సీ షేర్లు భారీగా దెబ్బతిన్నాయి. నిన్న న్యూఏజ్ షేర్లలో వచ్చిన ఒత్తిడి ఆందోళనకరంగా ఉంది. ఆల్ఫా నిఫ్టి నిన్న ఏకంగా రెండున్నర శాతం దాకా నష్టపోయింది. ఈ నేపథ్యంలో నిఫ్టి ఆరంభం లాభాలను నిలబెట్టుకుంటుందా అన్న అనుమానం కూడా వ్యక్తమౌతోంది. అన్ని బిజినెస్ ఛానల్స్ షేర్లను అమ్మమని సలహాలు ఇస్తున్నాయి. ఎండీఆర్ చార్జీల వల్ల బ్యాంకులకు లబ్ది చేకూరనుంది. ముఖ్యంగా ఎస్ బ్యాంక్ షేర్. మరి ఈ షేర్లు ఇవాళ ఎలా స్పందిస్తాయో చూడాలి.
