For Money

Business News

NSE షేర్ల లిస్టింగ్‌ 25న?

నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (NSE) పబ్లిక్‌ ఇష్యూకు సెబీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రూ.30వేల కోట్లను మార్కెట్‌ నుంచి సమీకరించనుంది. ధరల శ్రేణి ఈ నెల 11వ తేదీన వెల్లడించే అవకాశముంది. అలాగే ఈనెల 25వ తేదీన బీఎస్‌ఈలో లిస్ట్‌ కానున్నట్లు మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. దీనికి సంబంధించి ఎన్‌ఎస్‌ఈ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. పబ్లిక్‌ ఇష్యూలో భాగంగా 14.89 కోట్ల షేర్లను ఆఫర్‌ చేయనుంది. ఇది మొత్తం పూర్తిగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ రూపంలో జరగనుంది. ప్రస్తుత వాటాదారులు 6 శాతం వాటాలను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద అమ్మనున్నారు.. ఇందులో ఒక్క ఎస్‌బీఐనే 2.475 కోట్ల షేర్లను అమ్మనుంది.. ఎన్‌ఎస్‌ఈ వ్యాల్యూయేషన్‌ సుమారు రూ.5 లక్షల కోట్లుగా లెక్కగట్టారు. అనధికార మార్కెట్‌లో ఎన్‌ఎస్‌ఈ షేర్‌ ఇపుడు రూ. 1975 నుంచి రూ. 2000 మధ్య నడుస్తోంది. ఎన్‌ఎస్‌ఈ ఆఫర్‌ ధర రూ. 1800 నుంచి రూ. 2000 మధ్య ఉండే అవకాశముంది. ధర ఖరారు తరవాత కనీసం రూ. 200 గ్రే మార్కెట్‌ ప్రీమియం ఉండొచ్చని భావిస్తున్నారు. ఆఫర్‌ తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో వచ్చే వారం గ్రేమార్కెట్‌ ప్రీమియం మరింత పెరిగే ఛాన్స్ ఉంది.

Leave a Reply