For Money

Business News

ESDS బంపర్‌ లిస్టింగ్‌

ఏఐ రంగానికి చెందిన కంపెనీ ESDS సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌ కంపెనీ భారీ ప్రీమియంతో ఇవాళ లిస్టయింది. రూపాయి ముఖ విలువ ఉన్న ఈ షేర్లను కంపెనీ రూ. 429లకు కేటాయించింది. అయితే ఇవాళ ఉదయం అప్పర్‌ సీలింగ్‌ రూ. 908.40ని తాకింది. అలాట్‌మెంట్‌ ధరతో పోలిస్తే 111 శాతం లాభంతో ఈ షేర్‌ ట్రేడవుతోంది. ఈ ధర వద్ద కూడా ఏకంగా 18 లక్షల షేర్లకు కొనుగోలుదారులు ఉన్నారు. ఇక బీఎస్‌ఈలో ఈ షేర్‌ రూ. 895.55 వద్ద అప్పర్‌ సీలింగ్‌లో ఉంది. నాలుగు లక్షల షేర్లకు ఈ ధర వద్ద కొనుగోలుదారులు ఉన్నారు. మార్కెట్‌లో ఈ రంగంలో చెందిన పటిష్టమైన కంపెనీలు లేకపోవడంతో ESDS షేర్లకు భారీ డిమాండ్‌ వస్తోంది. ఈ కంపెనీకి భారీ ప్రీమియం లభించడంతో… వెంటనే ఇదే రంగానికి చెందిన ఇతర షేర్లకు డిమాండ్‌ వచ్చింది. ఉదయం నుంచి నష్టాల్లో ఉన్న ESE షేర్‌ ఏకంగా 3 శాతం లాభంతో రూ. 608 వద్ద ట్రేడవుతోంది. ఇక నెట్‌వెబ్‌ కూడా 2 శాతం లాభపడింది.

Leave a Reply