ఈ సిరీస్‌లో బ్రేకౌట్‌కు ఛాన్స్?
ఇవాళ్టి నుంచి సెప్టెంబర్ సిరీస్ ప్రారంభం కానుంది ఎన్ఎస్ఈలో. గిఫ్టి నిఫ్టి ఇప్పటికే ఆకర్షణీయ లాభాలను సూచిస్తోంది. ఒమన్‌తో ఇరాన్ చర్చలు ప్రారంభించడంతో క్రూడ్ ధరలు తగ్గడం ప్రారంభమైంది. ఇరాన్‌పై దాడులకు స్వస్తి పలికి, ఆర్థిక ఆంక్షలతో అమెరికా సరిపెట్టడంతో బ్రెంట్ క్రూడ్ 86 డాలర్లకు తగ్గింది. దీంతో మార్కెట్లో పాజిటివ్ మూడ్ కన్పిస్తోంది. ఈ నెలలో నిఫ్టి బ్రేకౌట్‌కు ఛాన్స్ ఉంటుందని టెక్నికల్ అనలిస్టులు అంటున్నారు. ఇప్పటికే నెల రోజుల నుంచి సూచీ హయ్యర్ హౌస్, లోయర్ లోస్ నమోదు చేస్తోంది. అత్యంత కీలకమైన ట్రెండ్ లైన్ వద్ద మద్దతు కూడా లభించింది. నిఫ్టి కన్నా స్మాల్, మిడ్ క్యాప్స్ షేర్లు బాగా రాణిస్తున్నాయి. మిస్సయిల్ టెక్నాలజీని ప్రైవేట్ కంపెనీలకు కూడా బదిలీ చేసేందుకు DRDO అంగీకరించడంతో ఇవాళ డిఫెన్స్ షేర్లు వెలుగులో ఉండే అవకాశముంది. జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌ను ఫెడరల్ బ్యాంక్ టేకోవర్ చేసే అవకాముంది. అయితే టేకోవర్ నిబంధనల కోసం మార్కెట్ ఎదురు చూస్తోంది. ఫెడరల్ బ్యాంక్ షేర్ నిన్న మూడు శాతం నస్టంతో ముగిసింది. ఇక ఆల్కాహాల్ వ్యాపారంలోకి వరుణ్ బేవరేజస్ వస్తోంది. ఈ మేరకు కొత్త కంపెనీని ఏర్పాటు చేసింది. ఇక వెల్స్పన్ కార్ప్‌లో ఇవాళ ప్రమోటర్లు 2.4శాతం వాటా అమ్ముతున్నారు. దీని ప్రభావం ఆ కౌంటర్లో ఉండొచ్చు.
