పబ్లిక్ ఇష్యూకు తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్
టుటికోరిన్ కేంద్రంగా పనిచేసే తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ పబ్లిక్ ఇష్యూకు రానుంది. ఈ మేరకు ప్రాస్పెక్టస్‌ను సెబి వద్ద దాఖలు చేసింది. 1.584 కోట్ల షేర్లను పబ్లిక్ ఆఫర్ చేయాలని నిర్ణయించింది. ఇందులో 75 శాతం షేర్లను క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూటషన్ బయ్యర్స్ (QIBs)కు ఆఫర్ చేస్తారు. కేవలం పది శాతం షేర్లను మాత్రమే రీటైల్ ఇన్వెస్టర్లకు ఆఫర్ చేస్తారు. ఐపీఓ ద్వారా రూ. 1000 కోట్లకు పైగా సమీకరించాలని, వచ్చిన నిధులను మూలధనం కోసం ఉపయోగిస్తామని బ్యాంక్ అంటోంది.గత మార్చితో ముగిసిన ఏడాదిలో బ్యాంక్ రూ. 603 కోట్ల నికర లాభం ప్రకటించింది. బ్యాంక్ మొత్తం వ్యాపారం రూ. 72,511 కోట్లు.