For Money

Business News

నాస్‌డాక్‌లో అమ్మకాల ఒత్తిడి

వాల్‌స్ట్రీట్‌ నష్టాల్లో ట్రేడవుతోంది. 30 ఏళ్ళ బాండ్‌ ఈల్డ్స్‌ రెండు దశాబ్దాల గరిష్ట స్థాయికి చేరడంతో ఇన్వెస్టర్లు భారీ అమ్మకాలకు పాల్పడుతున్నారు. డాలర్‌ ఇండెక్స్‌ బలహీనంగా ఉండం, బ్రెంట్‌ క్రూడ్‌ ధరలు 91 డాలర్లను దాటడంతో వాల్‌స్ట్రీట్‌లో ఒత్తిడి పెరిగింది. ముఖ్యంగా ఐటీ, చిప్‌ షేర్లలోనూ అమ్మకాలు సాగుతున్నాయి. తాజా సమాచారం మేరకు నాస్‌డాక్ ఒక శాతంపైగా నష్టంతో ట్రేడవుతోంది. ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ అర శాతం నష్టపోగా, డౌజోన్స్‌ మాత్రం స్వల్ప నష్టాలతో ఉంది. ఇరాన్‌, అమెరికా మధ్య ఇప్పట్లో రాజీ కుదిరే అవకాశాలు కనబడకపోవడంతో క్రూడ్‌ ధరలు భగ్గుమంటున్నాయి. ఇరాన్‌తో యుద్ధం ఇలాగే కొనసాగే పక్షంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని అనలిస్టులు హెచ్చరిస్తున్నారు. బాండ్‌ ఈల్డ్స్‌ పెరగడంతో బంగారం, వెండిలో కూడా అమ్మకాల ఒత్తిడి కన్పిస్తోంది.

Leave a Reply