ఇరాన్‌తో చర్చల్లేవ్…ట్రంప్
ఇరాన్‌తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ తమకు లొంగిపోయిందంటూ ఆయన తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. హర్ముజ్ జలసంధి ఇపుడు కొత్త అమెరికా భూభాగమంటూ ఆయన ఓ మ్యాన్‌ను పోస్ట్ చేశారు. దీనిపై ఇరాన్ చాలా ఘాటుగా స్పందించింది. ట్రంప్ భ్రమలు తొలిగిపోయే రోజు చాలా దగ్గర్లోనే ఉందని పేర్కొంది. మరో వైపు ఇరాన్, అమెరికా మధ్య చర్చలు ఇప్పట్లో జరిగేలా లేవని కతర్ పేర్కొంది. ఇరాన్, ఒమన్ మధ్య సంధి కుదరిన తరవాతే చర్చలు ఉంటాయని తెలిపింది. అయితే హర్ముజ్ సంబంధించి ఇరాన్, ఒమన్ మధ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
