గ్రీన్‌లోకి నిఫ్టి ఆల్ఫా
హించినట్లే మార్కెట్ మిడ్ సెషన్‌లో పుంజుకుంది. నిఫ్టి ఇంకా 86 పాయింట్ల నష్టంలో ఉన్నా… మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు బాగా పుంజుకున్నాయి. ముఖ్యంగా ఈ రెండు విభాగాలకు చెందిన బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల షేర్లు గ్రీన్‌లోకి వచ్చేశాయి. దీంతో ఇపుడు గ్రీన్ ఆల్ఫా లాభాల్లోకి వచ్చి 0.23 శాతం లాభంతో ఉంది. అలాగే నిఫ్టి నెక్ట్స్ 50 సూచీ కూడా గ్రీన్‌లోకి వచ్చింది. మిడ్ సెలెక్ట్ మాత్రం ఇంకా 0.6 శాతం నష్టంతో ఉంది. ఇవాళ అత్యధికంగా అర శాతం లాభంతో నిఫ్టి ఆటో షేర్ల సూచీ ఉంది. నిఫ్టి ఆటోలో 8 శాతం లాభంతో ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఇండియా టాప్‌లో ఉంది. ఇంకా బాష్, సోనా BLW, ఎం అండ్ ఎం, మదర్సన్ వంటి షేర్లు టాప్‌లో ఉన్నాయి. ఇక నిఫ్టి విషయానికొస్తే… ఇంకా 84 పాయింట్ల నష్టంతో 24200పైన ఉంటోంది. నిఫ్టిలో ఎం అండ్ ఎంతో పాటు బీఈఎల్, యాక్సిస్ బ్యాక్, పవర్ గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్ గ్రీన్‌లో ఉన్నాయి.
