For Money

Business News

FDI నిబంధనలు మరింత సరళం?

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) నిబంధనలను మరింత సరళం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దేశంలోకి విదేశీ పెట్టుబడులను మరింతగా ఆకర్షించేందుకు పలు చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతోంది. ఇన్నాళ్ళు దేశీయ ఇన్వెస్టర్లను నమ్ముకున్న కేంద్ర ప్రభుత్వం… భారీ ఎత్తున విదేశీ ఇన్వెస్టర్లు వెళిపోతున్నా… పట్టించుకోలేదు. ఇటీవలి కాలంలో డాలర్ల కొరత తీవ్రంగా రావడంతో డాలర్లలో విదేశీ డిపాజిట్ల సేకరణకు బ్యాంకులను పురమాయించింది. అయితే వడ్డీ భారం తడిసి మోపెడవుతందనే కారణంతో ఇపుడు FDIలపై దృష్టి పెట్టింది. నిబంధల్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టనుంది. ఒకసారి విదేశీ కంపెనీ అనుమతి తీసుకున్న తరవాత… ఆ కంపెనీకి చెందిన అనుబంధ కంపెనీలు మళ్ళీ కేంద్రం నుంచి అనుమతి పొందాల్సిన పనిలేకుండా నిబంధనలను మార్చనుంది. అలాగే రూ.5000 కోట్లకు మించిన విదేశీ పెట్టుబడులకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తప్పనిసరి అన్న నిబంధనను మార్చివేయనుంది. ఇక నుంచి రూ. 15,000 కోట్ల పెట్టుబడుల వరకు CCEA అనుమతి అక్కర్లేదని కేంద్రం భావిస్తోంది. FDI నిబంధనలను మార్చుతూ కేంద్రం ఇప్పటికే డ్రాఫ్ట్‌ నోట్‌ను సిద్ధం చేసింది. త్వరలోనే వీటిని కేబినెట్‌ పరిశీలనకు పంపనుంది. కేబినెట్‌ కూడా ఈ నిబంధనలకు ఆమోదం తెలిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Leave a Reply