ఇవాళ నష్టాలు ఎవరి ఖాతాలో….
వాళ కూడా నిఫ్టి నష్టాలతో ప్రారంభం కానుంది. గిఫ్ట్ నిఫ్టి ఏకంగా 90 పాయింట్ల నష్టంతో ఉంది. ఇవాళ నిఫ్టి వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్. CAS తరవాత కొత్త ట్రెండ్ మార్కెట్‌లో కన్పిస్తోంది. అలాగే ఇవాళ ఉదయం భారీ నష్టాలు వస్తున్నాయి. మరి దిగువ స్థాయిలో రికవరీ వస్తుందేమో చూడాలి. గత కొన్ని రోజులుగా 200 DMA వద్ద ఐటీ ఇండెక్స్ కదలాడుతోంది. ఐటీ షేర్లలో ఇవాళ కూడా అమ్మకాల ఒత్తిడి కొనసాగే అవకాశముంది. త్రైమాసిక ఫలితాల సీజన్ పూర్తయినట్లే. ఇవాళ బీఎస్‌ఈ, ఎంఎస్‌ఈ షేర్ల మధ్య గట్టి పోటీ ఉండే అవకాశముంది. మినరల్స్ ట్రేడింగ్‌లోకి MCX వస్తోంది. ఈ ప్లాట్‌ఫామ్స్ అభివృద్ధి కోసం రూ. 200 కోట్లు వెచ్చిస్తోంది. మరోవైపు ఈ సారి కరువు వచ్చే ఛాన్స్ 70 శాతమని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కయ్‌మెట్ అంచనా వేసింది. ఖరీఫ్ పంటలపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఉండే అవకాశముంది. మరోవైపు ఇవాళ పేటీఎంలో భారీ బ్లాక్ డీల్ ఉంది. చైనా కంపెనీ యాంట్ ఫిన్‌కు చెందిన కంపెనీ భారీ సంఖ్యలో షేర్లను అమ్మనుంది. ఏకంగా 5 శాతం వాటా అమ్మవచ్చని తెలుస్తోంది.
