For Money

Business News

నిఫ్టి ఇంతే… షేర్లు చూడండి

మార్కెట్‌ ఇవాళ కూడా స్థిరంగా ప్రారంభం కానుంది. గత కొన్ని రోజులుగా నిఫ్టి ఒక రేంజ్‌కు అలవాటైంది. మార్కెట్‌లో ఎలాంటి ట్రిగ్గర్‌ లేకపోయేసరికి రోజంతా 50 లేదా 70 పాయింట్లు కదలాడుతోంది. పైగా కొత్త విధానంపై ఇంకా ఇన్వెస్టర్లకు క్లారిటీ రాలేదు. చివర్లో షేర్లు అమాంతం ఎందుకు పెరుగుతున్నాయో అర్థం కావడం లేదు. రోజంతా లేని ధర… చివర్లో కన్పిస్తోంది. తరవాతి రోజు ఇక నష్టాలు తప్పడం లేదు. క్లోజింగ్‌ ధరల మదింపుపై ఇంకా అయోమయం నెలకొంది. పైగా కొత్త నిబంధనల నేపథ్యంలో చాలా మంది ఇన్వెస్టర్లు ఫ్యూచర్స్‌, ఆప్షన్స్‌కు దూరమైపోయారు. ఇవాళ కూడా నిఫ్టి ఒక రేంజ్‌లో కదలాడే ఛాన్స్‌ ఉంది. అంతర్జాతీయ మార్కెట్లు సూపర్‌గా ఉన్నా మన మార్కెట్లు నిస్తేజంగా ఉంటున్నాయి. ఫలితాలకు స్పందించడం వినా… షేర్ల ధరల్లో పెద్దగా మార్పులేదు.
నిఫ్టికి 24,500 వద్ద ప్రతిఘటన వస్తుండగా, 24,000 వద్ద మద్దతు లభిస్తోంది. ఆగస్టు నెలంతా ఇలానే సాగుతోంది. ఫలితాల సీజన్‌ కూడా పూర్తి కావొస్తోంది. మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలు పెద్దగా లేకపోవడంతో డే ట్రేడర్స్‌ కూడా మార్కెట్‌కు దూరంగా ఉన్నారు.

Leave a Reply