For Money

Business News

నికర లాభంలో 39% జంప్‌

జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో క్యాప్‌స్టన్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ కంపెనీ రికార్డు స్థాయిలో నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 38.5 శాతం వృద్ధితో రూ. 6.1 కోట్ల నుంచి రూ. 8.49 కోట్లకు నికర లాభం పెరిగింది. ఇదే సమయంలో టర్నోవర్‌ కూడా రూ. 190 కోట్ల నుంచి రూ. 220 కోట్లకు పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది. ఇవాళ జరిగిన బోర్డు సమావేశంలో కంపెనీ ఫలితాలను పరిగణనలోకి తీసుకున్నారు.
ఆల్‌ టైమ్‌ గరిష్ఠ స్థాయికి
మరోవైపు కంపెనీ ఇవాళ రికార్డు సృష్టించింది. ఎన్‌ఎస్‌ఈలో ఓపెనింగ్‌లో రూ. 600లను తాకింది. తరవాత రూ. 553 కనిష్ఠ స్థాయిని తాకినా.. తరవాత కోలుకుని రూ. 567 వద్ద ముగిసింది. క్రితం ముగింపు రూ. 525.9తో పోలిస్తే షేర్‌ 7.82 శాతం పెరిగింది.

Leave a Reply