అరబిందోలో బిగ్ డెవలప్మెంట్
పలు కంపెనీలకు సంబంధించిన కీలక అప్డేట్స్ అందుతున్నాయి. ముఖ్యంగా అరబిందో ఫార్మా బైబ్యాక్‌తో పాటు కొత్త పరిశోధనకు సంబంధించిన అప్ డేట్ ఇచ్చింది. అలాగే పలు కంపెనీల బిజినెస్ అప్డేట్స్ వస్తున్నాయి. వాటికి మార్కెట్ రియాక్ట్ కూడా అవుతోంది.
Aurobindo Pharma: కంపెనీ అనుబంధ సంస్థ CuraTeQ Biologics పరిశోధిస్తున్న Omalizumab biosimilar (BP11) మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో సానుకూల ఫలితాలు. US FDA, EMA అనుమతుల కోసం రెండో త్రైమాసికంలో దరఖాస్తు
Pace Digitek: ఆర్నెల్ల లాకిన్ ఓవర్. మార్కెట్లోకి 2.8 కోట్ల షేర్లు (ఈక్విటీలో 13% వాటా)
Globus Spirits: ‘Terai’ పేరుతో కొత్త బ్రాండ్ ప్రవేశపెట్టిన కంపెనీ. ధర రూ.3,600 నుంచి రూ. 5,815.
Nykaa: నటి దీపికా పడుకొనేకు చెందిన స్కిన్ కేర్ బ్రాండ్ 82°Eలో మెజారిటీ వాటా కొనేందుకు కంపెనీ ఆసక్తి. మీడియా వార్తలను ధృవీకరించిన కంపెనీ
Greenlam Industries: ఇండోనేషియా కంపెనీ PT Greenlam Indo Pacificలో 33 శాతం వాటా కొనుగోలు
Brigade Hotel Ventures: దేవనహళ్ళిలోని 135 సర్వీస్ అపార్ట్మెంట్ ఉన్న హయత్ హౌస్ నిర్వహణకు హయత్ డీల్.
Prabha Energy: నేటితో క్లోజ్ కానున్న కంపెనీ రైట్స్ ఇష్యూ.
Jubilant Foodworks: FY26 చివరి త్రైమాసికంలో 19.1% పెరిగి రూ. 2,506 కోట్లకు చేరనున్న కంపెనీ ఆదాయం.
Bajaj Finance: Q4 ఫలితాలు, ఫైనల్ డివిడెండ్‌పై నిర్ణయానికి ఈనెల 29న బోర్డు సమావేశం
Tube Investments of India: Orange Koiలో 76.24% వాటా కొనుగోలు.
Bajaj Finserv: ఫలితాల పరిగణనకు బోర్డు సమావేశం 30న
TRENT: మార్చితో ముగిసిన త్రైమాసికంలో 20 శాతం పెరిగి రూ. 4937 కోట్లకు చేరిన టర్నోవర్. 8 శాతం పెరిగిన షేర్
WIPRO: సింగపూర్ ఫుడ్ ప్రాసెసింగ్ గ్రూప్ ఓలామ్ గ్రూప్‌తో బిలియన్ డాలర్ల డీల్.
AIR INDIA: కంపెనీ సీఈఓ కాంప్‌బెల్ విల్సన్ రాజీనామా చేసినట్లు మీడియాలో వార్తలు. పదవీకాలం ఇంకా ఏడాది ఉన్నా… ముందే రాజీనామా
Aurobindo Pharma: రూ. 800 కోట్ల బైబ్యాక్.రికార్డు తేదీ ఏప్రిల్ 12. రూ.1475 ధరకు కొనుగోలు.
ANIL AMBANI GROUP: గ్రూప్ కంపెనీల్లో రూ.73,000 కోట్ల స్కామ్ జరిగినట్లు కోర్టుకు తెలిపిన సీబీఐ.
