For Money

Business News

ఇవాళ నష్టాలు తప్పవా?

నిన్న లాభాలతో ముగిసిన మార్కెట్‌కు ఇవాళ మళ్ళీ ట్రంప్‌ రూపంలో మరో తలనొప్పి వచ్చింది. ఇరాన్‌కు మళ్ళీ ట్రంప్‌ హెచ్చరించడంతో అమెరికా ఫ్యూచర్స్‌ నష్టాల్లోకి జారుకున్నాయి. నిన్న స్వల్ప లాభాలతో వాల్‌స్ట్రీట్‌ ముగిసింది. దీంతో ఇవాళ ఉదయం నుంచి గిఫ్ట్‌ నిఫ్టి 150 పాయింట్లకు పైగా నష్టంతో ఉంది. దీనికి ప్రధాన కారణం క్రూడ్‌ ధరలు భారీగా పెరగడమే. పైగా ఇవాళ నిఫ్టి వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ ఉంది. దీంతోకూడా మార్కెట్‌లో ఒత్తిడి వచ్చే అవకాశముంది. ఆసియా మార్కెట్లలో భారీ నష్టాలు లేవు. దీంతో
ఇవాళ కూడా దిగువస్థాయిలో మార్కెట్‌ మద్దతు అందేనా అన్న అనుమానం ఉంది. అయితే ఇరాన్‌ డెడ్‌లైన్‌ రేపు ఉదయంతో పూర్తి అవుతున్నందున… ఇన్వెస్టర్లు రిస్క్‌ తీసుకునే ఛాన్స్‌ తక్కువ. అమ్మకాలు లేకున్నా… కొత్తగా కొనుగోళ్ళు ఉండే ఛాన్స్‌ చాలా తక్కువ.

Leave a Reply