FBI డైరెక్టర్ కాష్ పటేల్ ఔట్?
ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాస్ పటేల్ ఉద్వాసన ఖాయమని వైట్ హైజ్ వర్గాలు అంటున్నాయని ప్రముఖ పత్రిక ద అట్లాంటిక్ ఓ వార్త రాసింది. అనేక మంది మంత్రులు, ఉన్నతాధికారులను తొలగించాలని అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయించినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇరాన్ యుద్ధంపై వైట్‌హౌస్ అంచనాలు తలకిందులు కావడం, జనంలో ఆదరణ నానాటికి పడిపోవడంతో ట్రంప్ తన సీనియర్లపై వేటు వేయాలని భావిస్తున్నారని సమాచారం. ఇప్పటికే పలువురు అధికారులపై ఫిర్యాదులు వచ్చినా… సీనియర్లను తొలగిస్తే విపక్షానికి ఆయుధం ఇచ్చినట్లువుతుందని ట్రంప్ భావిస్తూ వచ్చాయి. అయితే ఇపుడు పరిస్థితి దారుణంగా తయారైందని వైట్‌హౌస్ వర్గాలను ఉటంకిస్తూ పలు మీడియా కథనాలు వస్తున్నాయి. ముఖ్యంగా కాష్ పటేల్‌ను తొలగిస్తారనే వార్త ఇపుడు అమెరికా మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. గత నెలలో కాష్ పటేల్‌కు సంబంధించిన పర్సనల్ వీడియోలను ఇరాన్‌కు చెందిన హ్యాకింగ్ గ్రూప్ హందాలా హ్యాక్ టీమ్ బయట పెట్టింది. ఇప్పటికే పలువురు ఎఫ్‌బీఐ అధికారులు కాష్ పటేల్‌పై కేసులు వేశారు. తమను అన్యాయంగా తొలగించారని వీరు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఓ గాయనితో డేటింగ్ చేస్తున్న కాష్ పటేల్ ఆస్తులపై కూడా వార్తలు వస్తున్నాయి. ట్రంప్ మీడియా సంస్థలు కాష్ పటేల్ పెట్టిన పెట్టుబడులు ఇటీవల బాగా పెరిగాయని కూడా వార్తలు వస్తున్నాయి. గత ఏడాది ఫిబ్రవరిలో ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా నియమితులైన కాష్ పటేల్ గుజరాతి కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆయన తలిదండ్రులు చాలా కాలం క్రితమే అమెరికాకు వలస వచ్చారు.
