NIFTY TRADE: నిరోధం 17300పైనే
నిఫ్టి పరుగు ఆగడం లేదు. భారీగా పెరుగుతున్న నిఫ్టి ఇన్వెస్టర్లకు లాభాలతో పాటు టెన్షన్‌ను పెంచుతోంది. అనేక దీర్ఘకాలిక ట్రెండ్స్‌ను నిఫ్టితో పాటు బ్యాంక్ నిఫ్టి కూడా బ్రేక్ చేస్తున్నాయి. నిఫ్టి క్రితం ముగింపు 17,234. సాంకేతికంగా నిఫ్టి ఓవర్ బాట్ పొజిషన్లోఉన్నా సూచీలు పరుగులు పెడుతున్నాయి. నిన్న నిఫ్టి 157 పాయింట్లు పెరిగింది. మిడ్ క్యాప్ సూచీ ఒక శాతంపైగా పెరిగింది. కాని విదేశీ ఇన్వెస్టర్లు రూ. 300 కోట్ల నికర కొనుగోళ్ళు చేస్తే… దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు కూడా కొనుగోలు చేసింది కేవలం రూ. 380 కోట్లే. ఈ మాత్రానికే సూచీలు ఎలా పెరుగుతున్నాయి. పూర్తిగా సూచీ ప్రధాన షేర్లలోనే ట్రేడింగ్ జరుగుతోంది. మిగిలిన షేర్లలో ట్రేడింగ్ లేదనేది స్పష్టం. పైగా విదేశీ ఇన్వెస్టర్ల ట్రేడింగ్ చాలా వరకు ఎఫ్ అండ్ ఓ విభాగంలోనే ఉంటుంది. ఈ నేపథ్యంలో నిఫ్టికి ప్రతిఘటన 17300పైనే ఉంది. నిఫ్టికి ఇవాళ కీలక మద్దతు స్థాయి 17,180. ఈ స్థాయి దిగువకు వస్తే నిఫ్టికి 17160 వద్ద ఉంది. తరవాత 17,000 వరకు పడే వరకు నిఫ్టిలో పెద్దగా ఒత్తిడి లేదు. 17320 స్టాప్‌లాస్‌తో అమ్మొచ్చు. నిఫ్టి గనుక 17,350 దాటితే 17,500 వరకు కొనసాగే అవకాశముంది. కాబట్టి 17,320 తరవాత అమ్మొద్దు. ఇదంతా పెద్ద ట్రేడర్ల వ్యవహారం. చిన్న ఇన్వెస్టర్లు మార్కెట్‌కు దూరంగా ఉండటం బెటర్.