స్థిరంగా ప్రారంభం కానున్న నిఫ్టి
రాత్రి అమెరికా మార్కెట్లు గ్రీన్‌లో ముగిశాయి. కాని లాభాలు నామ మాత్రంగా ఉన్నాయి. డాలర్ స్థిరంగా ఉంది. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి. నిన్న నష్టాల్లో ముగిసిన జపాన్ నిక్కీ ఇవాళ ఒక శాతంపైగా లాభంతో ట్రేడవుతోంది. చైనా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. ముఖ్యంగా హాంగ్‌సెంగ్ 0.6 శాతం నష్టంతో ట్రేడవుతోంది. సింగపూర్ నిఫ్టి మాత్రం స్థిరంగా ఉంది. ఈ నేపథ్యంలో నిఫ్టి కూడా స్థిరంగా లేదా స్వల్ప లాభంతో ప్రారంభం కావొచ్చు.