హెచ్డీఎఫ్సీ లైఫ్ చేతికి ఎక్సైడ్ లైఫ్
ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్‌ను హెచ్డీఎఫ్సీ లైఫ్ టేకోవర్ చేసింది. రూ. 6,687 కోట్లకు మొత్తం ఈక్విటీని కొనుగోలు చేసింది. ఎక్సైడ్ ఇండస్ట్రీస్‌లో ఇన్సూరెన్స్ విభాగం విలువ షేర్‌కు రూ. 79లుగా లెక్క గట్టింది. ఈ మేరకు రూ. 685 ధర చొప్పున మొత్తం 8.7 కోట్ల షేర్లను ఎక్సైడ్కు హెచ్డీఎఫ్సీ లైఫ్ కేటాయించనుంది. అంటే మొత్తం డీల్ ఈక్విటీ డీల్ ద్వారా జరుగుతోంది. నగదు బదలీ లేదన్నమాట.