నో కింగ్స్.. నో ట్రంప్
ఈనెల 28వ తేదీన అమెరికన్ ప్రజలు దేశాధ్యక్షుడు ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా ప్రదర్శన నిర్వహించనున్నారు. ట్రంప్ ఓ రాజులా ప్రవర్తిస్తున్నారని, ఆయన చేస్తున్న యుద్ధాల వల్ల దేశ ప్రజలు నలిగిపోతున్నారని హాలివుడ్ ప్రముఖ నటుడు రాబర్ట్ డి నిరో ఆరోపించారు. ధరలు పెరిగి పేదలు అల్లాడిపోతున్నారని ఆయనతో పాటు పలువురు సెలబ్రిటీలు ఆరోపిస్తున్నారు. వీరందరూ ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తూ వచ్చే శనివారం అమెరికా వ్యాప్తంగా నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నారు. తమ దేశం బలవంతులు, అత్యాశపరులైనకోటీశ్వరులకు చెందినది కాదని… భయం కలగించి పాలించే నేతలది కాదని వీరు అంటున్నారు. యుద్ధోన్మాద చర్యలను వ్యతిరేకించాలని, ఇలాంటి సమయంలో మౌనం సరైన మార్గం కాదని అన్నారు.
