టెలికాం మంత్రితో కుమార మంగళం బిర్లా భేటీ
వొడాఫోన్ ఐడియా ఛైర్మన్‌గా రాజీనామా చేసిన నెల తరవాత ప్రముఖ పారిశ్రామిక వేత్త కుమార మంగళం బిర్లా కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్‌తో భేటీ అయ్యారు. టెలికాం రంగం భవితవ్యంపై వీరిద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. టెలికాం రంగం ఎదుర్కొంటున్న సమస్యలను బిర్లా వివరించినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. వోడాఫోన్ కంపెనీ ఆర్థిక ఊబిలో కూరుకుపోయిన తరవాత దేశీయ టెలికాం రంగంలో జియో, ఎయిర్టెల్ మాత్రమే మిగిలేలా ఉన్నాయి. ఈ సమయంలో మూడో కంపెనీ ఉండాల్సిన ఆవశ్యత గురించి బిర్లా వివరించినట్లు తెలుస్తోంది. అవసరమైతే 27 కోట్ల మండి సబ్స్క్రయిబర్లు ఉన్న వొడాఫోన్ కంపెనీని ప్రభుత్వ రంగ సంస్థకు ఇవ్వడానికైనా తాము సిద్ధమేనని బిర్లా స్పష్టం చేశారు.